Sunday, 2 August 2020

సత్యంవద-కొబ్బరి చిప్ప

లప్ప లప్పనియేవు 
లప్పనాదనియేవు
లప్ప నీ దెటులౌను చిలకా.....అయ్యో!
కొబ్బరి చిప్పయే నీ గతి చిలకా

లప్పయే సుఖమనీ 
లప్పయే బతుకనీ 
లప్పెనక పోయేవు చిలకా......ఖర్మ!
కొబ్బరి చిప్పయే నీ గతీ చిలకా

చిప్ప చిప్పనియేవు
చిప్పకాదనియేవు
చిప్పయే నీ గతీ చిలకా...అవునూ!
కొబ్బరీ చిప్పయే నీగతీ చిలకా

కాని కాలామొచ్చి
కళ్ళు మూసుకుపోయి
నీ బతుకు తెలియవే చిలకా...వహ్వా!
కొబ్బరి చిప్పయే నీ గతీ చిలకా

ఒళ్ళు పెరిగీ పోయి
మెడ తిప్ప లేకుంటె
చిప్పయే నీగతీ చిలకా...నిజమే!
కొబ్బరి చిప్పయే నీ గతీ చిలకా

ఒళ్ళు పెరిగీ పోయి
కళ్ళు మూసుకుపోయి
పిచ్చెక్కినప్పుడూ చిలకా...రామరామ!
కొబ్బరి చిప్పయే నీగతీ చిలకా

ఒళ్ళు పెరిగీ పోయి
బుఱ్ఱ పెరగాకుంటే
అప్పుడూ నీగతీ చిలకా...అయ్యయ్యో!
కొబ్బరి చిప్పలే నీ గతీ చిలకా

లప్పెక్కువైతేను
అతిమూత్ర వ్యాదొస్తె
చిప్పయే నీకు గతి చిలకా...శాభాషూ!
కొబ్బరీ చిప్పయే నీకు గతి చిలకా

చిప్పనూ కాదనీ 
లప్ప సంపాదిస్తే
లప్ప నీ వెంటవదు చిలకా........అయ్యో!
కొబ్బరీ చిప్పయే నీగతీ చిలకా

కొడుకులూ కోడళ్ళు తన్ని తగిలినవేళ
ఆత్మీయులెవ్వరూ ఆదరించని వేళ
రామ నామమే  నీగతీ చిలకా....అంతే! అంతే!!
కొబ్బరిచిప్పలే నీ గతీ చిలకా

లప్పకాదనుకునీ
చిప్పయే బతుకంటె
తిప్పక్కడున్నదే చిలకా...నిజమా?
నీ బతుకు తిప్పక్కడున్నదే చిలకా

కాని కాలంలోన
కట్టెలే నీ తోడు
కాని కాలమొచ్చి కట్టెలే లేకుంటె
చిప్పలే నీ గతీ చిలకా

కొబ్బరి చిప్పలే నీగతీ
మొద్దులే నీ గతీ
డొక్కలే నీ గతీ
కమ్మలే నీ గతీ
ఆకులే నీ గతీ
గులకలే నీ గతీ
పుచ్చెలే నీగతీ
దయ్యపు పుచ్చలే నీ గతీ చిలకా

దయ్యపు పుచ్చలూ లేకుంటె
పాతరే నీగతీ చిలకా
నిలువు పాతరే నీ గతీ చిలకా
ఉప్పు పాతరే నీ గతీ చిలకా

సత్యంవద-మహాభారత యుద్ధం


మహాభారత యుద్ధం  https://tappoppulu.irusu.in/

    మానవ చరిత్రలో ఏ యుద్ధానికైనా మూల కారణాలు కాంతాకనకాలే! మహాభారత యుద్ధం దీనికి వ్యతిరేకంకాదు. ఈ కారణాలతో మరిన్ని కారణాలూ కనపడతాయి.


మహాభారత యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్న కాలం సైనిక సంచలనం జరుగుతున్నది, మరోపక్క రాయబారాలూ నడుస్తున్నకాలంలో ధృతరాష్రుడు సంజయుని పిలిచి అడుగుతాడిలా! ''సంజయా ప్రాణాలకి తెగించి భూమికోసం ఎందుకిలా రాజులు యుద్ధాలు చేస్తారు?'' దానికి సంజయుడు ''రాజా పంచభూతాలలో చివరిది భూమి.మానవులకు అవసరమైన మిగతా మూడు భూతాలూ నేలను ఆశ్రయించి ఉంటాయి. ఇందులొ పర్వతాలు,నదులు,గనులు ఇలా మానవులకు కావలసిన సర్వస్వం భూమినుంచే దొరుకుతుంది, అందుకే రాజులు ప్రాణాలకి తెగించి యుద్ధాలు చేస్తా''రంటాడు.  


 కాదు అనుమానమే! నిజంగానే అందరి మనసుల్లోనూ ఉన్నదే! ఎందుకంటే

 అక్షౌహిణి అంటే లక్ష సైన్యం, ఎన్నో రథాలు,అన్నే ఏనుగులు,గుఱ్ఱాలు. ఇక కౌరవ పాండవుల సైన్యం పద్దెనిమిది అక్షౌహిణీలు మొత్తం, అంకెలు చూస్తుంటేనే గుండె బేజారెత్తిపోతోంది.  వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు,ఎక్కడ తిన్నారు, ఎక్కడ యుద్ధం చేసారు? కురుక్షేత్రం లో జరిగితే  చోటెక్కడా?ఇన్ని లక్షల మందీ ఉండడానికి చోటేదీ? యుద్ధం మాట దేవుడెరుగు ఇదీ అనుమానం.

జాగ్రత గా చూసుకుంటూ వెళితే కవిత్రయ భారతమే అన్నిటికి సమాధానం చెబుతుంది. అలా ముందుకెళ్దాం, అవధరించండి.

అక్షౌహిణి సైన్యం అంటే భారతం ఇలా చెప్పింది. రథం,ఏనుగు,గుఱ్ఱం,కాలిబంటును మూలంగా తీసుకుని.

””వర రథ మొక్కండు వారణ మొక్కండు,తురగముల్ మూడుకాల్వురును నేవు
రనుసంఖ్య గలయదియగు బత్తి యది త్రిగుణంబైన సేనాముఖంబు దీని
త్రిగుణంబు గుల్మంబు దీని ముమ్మడుగగు గణము తద్గణము త్రిగుణితమైన
వాహినియగుదాని వడి మూటగుణియింప బృతననాబరగుదత్పృతనమూట

గుణితమైన జమువగున్ మఱి దాని మ్ముమ్మడుగనీకిసమాఖ్య నొనరు
నది యు బదిమడుగులైన నక్షౌహిణీయౌ నిరంతర ప్రమానుసంఖ్య.”” ఆo.మ.భారతం.ఆది.ప. ఆశ్వాసం 1--80 

ఒకరథము,ఒక ఏనుగు,మూడు గుఱ్ఱాలు, ఐదుగురు కాలిబంట్లు, మూలంగా తీసుకుంటే, దీనిని బత్తి అన్నారు. ఇటువంటి బత్తి లు మూడైతే అది సేనాముఖం . సేనాముఖాలు  మూడైతే
గుల్మం . గుల్మాలు మూడైతే గణం , గణాలు మూడైతే వాహిని , వాహినిలు మూడతే పృత , పృతలు మూడైతే     చమువు ,  చమువులు మూడైతే సమాఖ్య. ఇటువంటి సమాఖ్యలు పది ఒక అక్షౌహిణి.

బత్తి.
1 రథము
1 ఏనుగు
3 గుఱ్ఱాలు
5 కాలిబంట్లు

సేనాముఖం.
3రథములు
3ఏనుగులు
3 X 3= 9గుఱ్ఱాలు
3 X  5=15 కాలిబంట్లు

గుల్మం.
3 X 3 =9 రథములు
3 X 3= 9 ఏనుగులు
3 X 9=27 గుఱ్ఱాలు
3 X 15=45 కాలిబంట్లు

గణం
3 X 9=27 రథములు
3 X 9=27 ఏనుగులు
3 X 27= 81గుఱ్ఱాలు
3 X 45=135 కాలిబంట్లు

వాహిని
3 X 27= 81రథములు
3 X 27= 81ఏనుగులు
3 X 81=243 గుఱ్ఱాలు
3 X 135=405కాలిబంట్లు

పృత
3 X 81=243 రథములు
3 X 81=243 ఏనుగులు
3 X 243= 729 గుఱ్ఱాలు
3 X 405=1215 కాలిబంట్లు

 చమువు
3 X 243= 729 రథములు
3 X 243= 729 ఏనుగులు
3 X 729= 2187గుఱ్ఱాలు
3 X 1215=3645కాలిబంట్లు


సమాఖ్య.
3 X 729=2187 రథములు
3 X 729=2187ఏనుగులు
3 X 2187=6561 గుఱ్ఱాలు
3 X 3645= 10,935కాలిబంట్లు.

అక్షౌహిణి
10 X 2187=21,870 రథములు
 10 X 2187=21,870ఏనుగులు
10 X 6561= 65,610గుఱ్ఱాలు
10 X 10,935= 1,09,350 కాలిబంట్లు.

తరవాత కాలంలో అంకెలు తప్పునుకోకుండా ఉండడానికి అక్షరాలా రాసారు. ఇలా అంకెలలో వేసినవి అక్షరాలలో రాయడం మనకి చాలా కాలంగా ఉన్న అలవాటే! భారతం మాటిది.

””ఇరువదియొక్కవేయు నెనమన్నూట డెబ్బది రథంబులు (21,870), నన్ని యేనుంగులు (21,870) నరువదేనువేలునాఱునూటపది (65,610) గుఱ్ఱంబులు లక్షయుందొమ్మిదివేలున్ మున్నూటయేబండ్రువీరభటులును (1,09,350) గలది యొక్క యక్షౌహిణి యయ్యె నట్టియక్షౌహిణులుపదునెనిమిదింట సన్నధులై కురు పాండవులు యుద్ధంబు సేయుటం జేసి యా శమంతపంచకంబు కురుక్షేత్రంబు నా బరగె నట్టి కురుక్షేత్రంబునందు.”” (ఆo.మ.భా ఆది.ప.ఆశ్వా-1-81)

మూడు గుఱ్ఱాలూ రథానికి కట్టేవి. ఐదుగురు కాలి భటులన్నారు. రథాలూ, ఏనుగులన్నారే కాని వాటిని నడిపేవారు, వాటిలో ఉండి యుద్ధం చేసేవారిని ఈ అక్షౌహిణిలో కలపలేదు. ఒక రథానికి ఒక సారథి,రథికుడూ కావాలి. అదీగాక ఈ రథానికున్న రెండు వైపుల చక్రాలని రక్షించే వారిని చక్ర రక్షకులని భారతం చెబుతోంది. వారు మరొక ఇద్దరు కావాలి. వారు రథంతో బాటు వెళ్ళడానికి రెండు గుఱ్ఱాలూ కావాలి. వీరిని కూడా కలుపుకుంటే ఒక అక్షౌహిణితో ఉన్న గుర్రాల సంఖ్య 65,610+ (21,870 X 2)= 43,740 అనగా మొత్తం 1,09,350 గుఱ్ఱాలు. ఇక మనుష్యులైతే రథానికి నలుగురు+ఏనుగుకు ఇద్దరు చొప్పున 21,870 X 6=1,31,220 మంది ఉంటారు.

మొత్తం ఒక క్షౌహిణి సేనతో ఉండే వారి సంఖ్య ఇలా ఉంటుంది.
రథాలు 21,870
ఏనుగులు  21,870
గుఱ్ఱాలు  65,610 + 43,740=1,09,350
చక్రరక్షకులు,మావటులు,సారధులు,వీరులు + కాలి భటులు 1,31,220 + 1,09,350 = 2,40,570.

వీరేగాక యుద్ధ రంగానికి వెలుపల ఉండి యుద్ధంలో పాల్గొనేవారికి కావలసినవి సమకూర్చి పెట్టే వారు ఎందరు? వారు నటవిట గాయక,వేశ్య, వణిక్కులని భారతం మాట. వీరుగాక వండి వార్చేవారు, జంతువులకు మేత ఏర్పాటు చేసేవారు. మొత్తం వీరిని రెండున్నర లక్షలుగా తీసుకుంటే సైన్యం,వీరులందరిని రెండున్నర లక్షలుగా అనుకుంటే మొత్తం ఐదు లక్షలమంది మనుషులు ఒక అక్షౌహిణికి సంబంధించి ఉంటారు కదా! మరి పద్దెనిమిది అక్షౌహిణిలకు మొత్తం తొంబై లక్షల జనాభా అవుతారు. చూస్తూ ఉంటే ఈ సంఖ్య కొత్తగోదావరి వరదలా నిమిషనిమిషానికి పెరిగి ఐదు  లక్షలకి  చేరింది. వీరంతా ఎక్కడ ఉన్నారు? ఎక్కడ తిన్నారు, ఎక్కడ కొట్టుకు చచ్చేరు? చూదాం.

శమంత పంచకం అనేవి ఐదు చెఱువులు. పరశురాముడు రాజులను ఇరవైయొక్క సార్లు వధించగా  అంటిన  రక్తపు
గండ్రగొడ్డలిని ఆ చెఱువులలో కడిగాడని ఇతిహాసం. ఆ ప్రాంతంలో జరిగిన యుద్ధం  కురువంశీయుల యుద్ధంగనక ఆ ప్రదేశాన్ని  కురుక్షేత్రం అన్నారని మహాభారతం మాట.

కురుక్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని నూట ఇరవై కిలో మీటర్ల వ్యాసార్ధంతో ఒక వృత్తాన్ని ఊహిద్దాం. వృత్తం చుట్టు కొలత 2 పై ఆర్ అనగా 2 X 3 X 120== 720 కిలో మీటర్లు. చుట్టుకొలత అనగా పరిధిని పద్దెనిమిది భాగాలు చేసి ఒక్కొక భాగం ఒక అక్షౌహిణికి కేటాయిస్తే, ఒక్కొక అక్షౌహిణికి వచ్చే బాగం నలభై కిలో మీటర్లు. అలా ఆనలభై కిలో మీటర్ల పరిధి భాగాన్ని వెనక్కి అంటే వృత్త పరిధి వెనక్కి కనక ఒక పాతిక కిలో మీటర్లు పొడిగిస్తే, ఆ దీర్ఘచతురస్రం పొడుగు వెడల్పులు 40 kmX 25km = 1,000 sq.km ఒక వెయ్యి చదరపు కిలో మీటర్లు కదా! ఒక అక్షౌహిణితో ఉండే జనాభా ఐదులక్షలనుకున్నాం, ఎనుగులు,గుర్రాలు, రథాలు కాక కదా! ఇప్పుడు ఈ వెయ్యి చదరపు కిలో మీటర్లలోనూ ఐదు లక్షలమందీ, చదరపు కిలో మీటర్ కి ఐదు వందల మంది చొప్పున   ఉంటారు, వారితో పాటుండే సకల రథ,గజ,తురగాలతో. పదాతులు పరిధికి దగ్గరానూ,వారి వెనుక, గజాలు, ఆ వెనుక రథాలూ ఉండి. వీరికి కావలసిన సర్వ అవుసరాలూ తీర్చేందుకు కావలసినవి ఆ వెనుక తీర్చి దిద్దుకుంటే ఒక్కొక అక్షౌహిణి ఒక మహా పట్టణం, వెయ్యి చదరపుకిలో మీటర్లలో. ఇలాగే మిగిలిన అక్షౌహిణిలూ ఉంటాయి కదా! ఇక వీరెక్కడ యుద్ధం చేసేరని అనుమానం


నూట ఇరవై కిలో మీటర్ల వృత్తాన్ని ఊ హించాం కదూ! అది ఇలా ఉంటుంది. తెల్లని భాగమంతా రణ రంగం. తెల్లని భాగం కి పైనున్న నల్ల భాగంలో సేనా నివాసాలు, సౌకర్యాలున్నూ.


. ఈ నూట ఇరవై కిలో మీటర్ల వృత్త వైశాల్యం ఎంత? వృత్త వైశాల్యం పై ఆర్ స్క్వేర్ కదా! 3 X 120 km X 120 km= 43,200 sq.km చదరపు కిలో మీటర్లు. నల్ల భాగంలో, ఒక్కో అక్షౌహిణి కి కేటాయించిన నలభై కిలో మీటర్ల పరిధి భాగాన్ని వెనక్కి పాతిక కిలో మీటర్లు పొడిగించుకుంటే వచ్చిన మొత్తం వైశాల్యం పద్దెనిమిది వేల చదరపు కిలో మీటర్లు. ఒక్కొక అక్షౌహిణికి వెయ్యి చదరపు కిలో మీటర్ల చోటు. 

కాలి భటులు వృత్త పరిధిపై రణరంగానికి దగ్గరగా ఉంటారు.
యుద్ధంలో పద్దెనిమిది అక్షౌహిణిలూ ఒక రోజే పాల్గొనలేదు. ఒక రోజో వ్యూహంతో యుద్ధం జరిగింది. పద్దెనిమిది రోజుల యుద్ధంలోనూ పద్దెనిమిది  అక్షౌహిణిల సైన్యం మడసింది. మావటులు,చక్రరక్షకులు,సారధులు యుద్ధంలో వారు కాదు కాని అప్పుడప్పుడు చంపబడ్డారు. సరాసరిన రోజుకు ఒక అక్షౌహిని సేన మడసింది. రెండులక్షల మంది ఒక రోజు యుద్ధం లో పాల్గొంటే ఒక లక్ష చనిపోయారు. రెండు లక్షల మంది నేలమీద ఏనుగు, రథాల మీద ఉండి యుద్ధం చేయడానికి ఇంత వైశాల్యం 43,200 square km చాలనుకుంటా.

యుద్ధ రంగానికి బయటవారికి సంబంధం లేదు. బయట నుంచి యుద్ధానికి కావలసిన సరఫరాలన్నీ వెనుకనుంచి రావడానికీ ఇబ్బంది లేదు. సైన్యంతో పాటు నటవిటగాయక వేశ్యవణిక్కులు కూడా ఉన్నారన్నది భారతం మాట. ఈ అలవాటుతోనే ఆంగ్లేయులతో జరిగిన మొదటి యుద్ధానికి మరాఠీలు ఇలా తరలి వస్తే ఆంగ్లేయులు ఆశ్చర్యపోయినట్టు చరిత్ర మాట.
రణరంగం ప్రత్యేకంగా ఉన్నదనడానికి తార్కాణం. పద్దెనిమిదవ రోజు యుద్ధం నుంచి నడచిపోయి చెఱువులో దాగున్నాడు,దుర్యోధనుడు. అతన్ని కనుగొని భీమునితో యుద్ధానికి అందరూ కలసి యుద్ధరంగానికి తిరిగొచ్చారన్నది భారతం మాట.   
సైంధవ వధ రోజు యుద్ధం మధ్యలో రణరంగంలో కృష్ణుడు రథాన్ని ఆపి గుఱ్ఱాలని కడిగి సేద దీర్చి పచ్చిక మేపినమాట కాదన లేనిదే!
 ఒక వేళ ఈ చోటూ సరిపోదనుకుంటే 120 కిలో మీటర్ల వ్యాసార్ధాన్ని పెంచుకుంటే నివాసాలూ యుద్ధరంగమూ విశాలమవుతాయి.     
 ఇప్పుడు చెప్పండి మహాభారత యుద్ధం జరిగిందంటారా?   

సత్యంవద-శ్రీజి.పి.శాస్త్రి

శ్రీజి.పి.శాస్త్రి  అనే గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారొక రిటయిర్డ్ ప్రొఫెసరు. వారు తెనుగులో ఒక పద్యాల పుస్తకం వేశారు. ఆ పుస్తకాన్ని నాకు పంపే సందర్భంలో జిలేబి నాకు శాస్త్రి గారిని పరిచయం చేశారు.పారితోషికం పంపించే సందర్భంగా ఒకటి రెండు సార్లు మెయిలిచ్చారు. అదే పరిచయం. పెద్దవారు కదా వీరికి జరుగుతున్నది విన్నవిద్దామనుకుని చెప్పేను. వారు నాకు తెనుగే తెలియదన్నారు. తెనుగులో పద్యాలల్లి పుస్తకాలేసినవారు తెనుగు రాదంటే అర్ధమే కాలేదు. జిలేబి మాయలో మరో మాయ. 


"గౌ\\ జిలేబీ గారూ,

శంకరాభరణం బ్లాగులో శ్రీ కంజర్ల రామాచార్య గారు వ్రాసిన ఈ క్రింది పద్యాన్ని బహు లాఘవంగా ఫోటోషాపి చేసి మీరు నా పేరు, మాస్టారు గారి పేరు జొప్పించి నా బ్లాగులో మీ పద్యం క్రింద చెలామణీ చేయడం, తద్వారా నా వ్యక్తిత్వ హననానికి పాల్పడం చాలా హేయమైన దుందుడుకు చర్య, ఆటకాయతనం.

(https://kandishankaraiah.blogspot.com/2020/03/3306.html)
కంజర్ల రామాచార్య.మార్చి 11, 2020 6:07 AM

పీకనుఁ దాక త్రావితివొ? పెంపు వహించిన మత్తు మున్గితో?
వాకొన నేల సంగతమొ? వాసి వహించగఁ జేయు యత్నమో?
ప్రాకటపాలకాగ్రణిసభావికృతోక్తులఁ వోలె నేలనో?
శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే

(శ్రీ కంజర్ల రామాచార్య గారి అనుమతి లేకుండా వారి పద్యాన్ని సందర్భానుసారంగా
వాడవలసి వచ్చింది. అందుకు వారిని మన్నించ వలసిందిగా కోరుకుంటున్నాను).

అంతగా నొప్పించిన తర్వాత జరిగిన దానికి పశ్చాత్తాపం ప్రకటించడానికి బదులుగా సింపుల్ గా మాలికలో మాత్రమే మీరు వ్రాసింది డిలీట్ చేసి "మా కామింటు డెలీటాయనమః :)" అని చాలా లైట్ గా తీసుకుని, అసలిదో విషయమే కాదన్నట్లుగా ఊరుకోవడం మీలో అసలు పశ్చాత్తాప భావనే లేదనడానికి నిదర్శనం, మిక్కిలి బాధాకరం. గతం తరచి చూస్తే ఆ విషయంలో మీ రికార్డు మెరుగ్గా ఉన్న దాఖలా లేదనుకోండి. అయినా ఇతరులను నొప్పించడం, లెక్క చెయ్యక పోవడం, చిన్న చూపు చూడటం మీకు నిత్యకృత్యమే ననుకోండి. మిమ్మల్ని గౌరవిస్తున్న వ్యక్తులతో కూడా మీరిలా ప్రవర్తించడం చాలా శోచనీయమైన విషయం, ఆశ్చర్యకరం. మీ ప్రవర్తనలో బాధ్యత లేని విధం, లోపించిన హుందాతనం, కనబడని పెద్దమనిషి తనం చూసి చాలా చింతిస్తున్నాను జిలేబీ గారు. అవి మీ వద్ద లభిస్తాయని నేను ఆశించడం నా తెలివి తక్కువ తనం, దురాశ. స్వస్తి."
========================================================================
2.
"G P Sastry (gps1943@yahoo.com)
Fri, Mar 13, 2:01 PM (16 hours ago)G P Sastry (gps1943@yahoo.com) "సమస్య - 3308 (ప్రత్యుపకారమ్ము...)" పోస్ట్‌పై క్రొత్త వ్యాఖ్యను చేర్చారు:


అల్లరి బుచికి

.

శంకరాభరణం కు మార్చి 13, 2020 2:01 PM న G P Sastry (gps1943@yahoo.com) పోస్ట్ చేసారు

sarma
Mar 13, 2020, 5:48 PM (12 hours ago)
sarma "సమస్య - 3308 (ప్రత్యుపకారమ్ము...)" పోస్ట్‌పై క్రొత్త వ్యాఖ్యను చేర్చారు:

ఇటులల్లరిపాలగుచుంటిమే! తమరేమందురు సామీ!

Wed, Mar 11, 7:31 AM (2 days agoZilebi has left a new comment on the post "నా పాట (my song) ... "హల్లో హల్లో హల్లో మిస్ భానుమ...":పీకనుఁ దాక త్రావితివొ? పెంపు వహించిన మత్తు మున్గితో?
వాకొన నేల సంగతమొ? వాసి వహించగఁ జేయు యత్నమో?
ప్రాకటపాలకాగ్రణి సభా వికృతోక్తులవేల బండి జీ?
శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ మన రాజు పల్కులౌ!


నారదా
జిలేబి


.

శంకరాభరణం కు మార్చి 13, 2020 5:48 PM న sarma పోస్ట్ చేసారు
====================================================
3.
.sarma "సమస్య - 3308 (ప్రత్యుపకారమ్ము...)" పోస్ట్‌పై క్రొత్త వ్యాఖ్యను చేర్చారు:

ప్రభాకర శాస్త్రి గారు
నమస్కారం!

తమతో ఇలా ఎదురుపడాల్సిరావడం నా దురదృష్టం. అపరాధ శతం క్షమస్వ!

తమ జవాబు కోసం ఎదురు చూశాను. మా బతుకులు వీరి చేతిలో నవ్వులపాలవుతూనే ఉన్నాయి, నిత్యమూ. ఎప్పటికప్పుడు నవ్వేసుకుంటూనే ఉన్నాం!ఏమీ చేయలేక. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా, అపహాస్యం పాలు చేసినా! కలికాలం కదండీ.

మీరంతా చదువుకున్నవారు,పెద్దపెద్ద ఉద్యోగాలు చేసినవారున్నూ, మాలాటి పిపీలకాలం వీరిబోటి వారికి కానం.మీకిటువంటి కుక్క జట్టీలు తెలియక పోవచ్చు, లేదా పట్టించుకోనూ పోవచ్చు. అందుకు కొంత చెప్పక తప్పదు.

వీరు నా బ్లాగులో 2015 సంవత్సరం నుంచి సాగించిన అపహాస్యం,వ్యక్తిత్వ హననం చెప్పుకోదగ్గది. వీరు బ్లాగులలో కొంతమంది అరాచకవాదులను రెచ్చగొట్టి ఇతర బ్లాగర్లను బెదిరించడం,వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, అందరికి తెలిసిన సంగతే! ఎవరూ మాటాడరు, కాదు మాటాడలేరు, కారణం, ఎవరేనా ఎదురడిగితే నీకు బ్లాగుందా,దాని పేరేంటి, నీ సంగతి చూస్తా అని బెదిరించడం అలవాటు. బ్లాగులున్నవాళ్ళని హింస పెట్టడం మరో వికృత హేల వీరికి.వారి పై ఇతరబ్లాగుల్లో ప్రచారం చేయడం వీరి అలవాటు. ఈ హింస భరించలేక బ్లాగులు వదలిపోయినవారెందరో!

ఇప్పుడు జరుగుతున్నది చూస్తున్నారుగా! ఆ అర్భకుడి వ్యక్తిత్వ హననం ఎలా జరుగుతోందో! మరో మాట నిన్నటికి మొన్న జన సామాన్యం లో ఉన్నమాటలే రెండు మరెవరి బ్లాగు నుంచో దొంగిలించుకు వచ్చానని, వీరు చేసిన ప్రచారం, ఏమని చెప్పను?.

మీరు పెద్దలుగనుక ఈ విషయం తమకు ఎఱుక చేయడం నావిధిగా తలచాను. మీరు మేము చేసిన తప్పులకు ( వారితో సమానంగా బ్లాగు రాయడమా? హన్నా!. ఎంత నేరం,ఎంత నేరం)ఏ శిక్ష విధించినా సిద్ధం. నేనిప్పటికే బ్లాగుల్ని వదిలేశాను,ఫోన్ కూడా వదిలేయాలిసిందే, ఎవరో అభిమాని వస్తానంటే, ఫోన్ చేతిలో ఉంచుకోక తప్పలేదు. ఈ అర్భకుడి పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయాను. ఇది కురు సభ కాదనే తలుస్తాను.

తమరు అర్ధరాత్రి దాకా మెలుకువగా ఉంటారని తెలిసి ఈ కామెంట్ వేస్తున్నా!
మీ జవాబు ఆశిస్తాను.

.

శంకరాభరణం కు మార్చి 13, 2020 8:48 PM న sarma పోస్ట్ చేసారు
----------------------------------------------------------------
G P Sastry (gps1943@yahoo.com)
Fri, Mar 13, 9:38 PM (8 hours ago)
G P Sastry (gps1943@yahoo.com) "సమస్య - 3308 (ప్రత్యుపకారమ్ము...)" పోస్ట్‌పై క్రొత్త వ్యాఖ్యను చేర్చారు:


శ్రీమాన్ కష్టేఫలి శర్మ గారు:

నాకు తెలుగు వ్రాయడం రాదు...అర్థం కూడా అవదు.

మీ గురించి జిలేబి గారు గతంలో నాకు వ్రాసిన మాటలు ఇచ్చట పొందు పరచుచున్నాను:

"శ్రీ శర్మ గారితో మాట్లాడటమే ఒక అందమైన అనుభవం.

Enjoy good company of people. See if you can contact him. It will be a pleasure for both of you coming from different walks of life.

We call him Blog Gandhi. Like you sir, he is also a towering personality albeit from different profession.


జిలేబి"

నమస్సులు
శంకరాభరణం కు మార్చి 13, 2020 9:38 PM న G P Sastry (gps1943@yahoo.com) పోస్ట్ చేసారు
-------------------------------------------------------------------------------------------------

sarma
Fri, Mar 13, 10:01 PM (7 hours ago)sarma "సమస్య - 3308 (ప్రత్యుపకారమ్ము...)" పోస్ట్‌పై క్రొత్త వ్యాఖ్యను చేర్చారు:

శాస్త్రిగారు,
నమస్సులు
తమరు చెప్పింది వీరి అనేక ముఖాలలో ఒకటి.

ఒక మాట చెప్పడం మరచా! ఎన్ని చెప్పినా ఒకటి మిగిలుంటుంది వీరి పట్ల.

మీకే ఒక బ్లాగుంది.దానిలో ఒక టపా మీద ఎవరో అనవసర వ్యాఖ్య రాస్తే, లేదా మీ మనసు నొచ్చుకునే వ్యాఖ్య చేస్తే, తొలగించడమో,ప్రచురించడం మానేయడమో మీరు చేశారు. తన కామెంట్ ను ప్రచురించలేదన్న కోపం ఉన్నవాళ్ళని రెచ్చగొట్టి తన బ్లాగులో ఇతరుల బ్లాగుల పట్ల అవాచ్యాలు పలికించిన వ్యక్తిత్వమూ వీరిదే! ఇలా అరాచక వాదుల్ని రెచ్చగొట్టే వ్యక్తిత్వమూ వీరిదే!వీరు సరైన టపా రాసి ఎన్నేళ్ళయిందో! బుర్రలో గుంజు ఎండిపోయి ఉండచ్చు, అందుకే ఈ పోకడలు.

మా ఊరూ పేరూ అందరికి తెలిసినవే, చదువు లేకపోయినా సంస్కారం ఉన్నవాళ్ళమే! వీరికి చదువుంది మరి రెండవదే లోపించినట్టుంది.వీరి నోటికి ఎంతమాటొస్తే అంత మాటా అనేయగలరు. వీరి బలం వీరి వూరూ పేరూ తెలియకపోవడం. సిగ్గు అనేది లేకపోవడం. వీరి మరో వికృత చర్య, వీరికి నచ్చని వారి గురించిన కామెంట్లు మాలికలో ప్రముఖంగా కనపడేలా మళ్ళీ మళ్ళీ అనేక బ్లాగుల్లో ప్రచురించడం.

తమకి తెనుగు రాదంటే.......మాది అరణ్య రోదనమే...శంకరాభరణం కు మార్చి 13, 2020 10:01 PM న sarma పోస్ట్ చేసారు

సత్యంవద-వద్దురా చిన్నయ్యా!

వద్దురా చిన్నయ్యా!
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!

కట్టినా మాస్కేమో దగ్గుకే మాసేను పాలుగారే మోము తుమ్ముకే వాడేను
వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!

కరోన ఇళ్ళకి కదలివచ్చేవేళ ముదిపాపలను చూసి పట్టుకెళ్ళేవేళ
వద్దురా చిన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!

కరోనవాళ్ళంత కానివాళ్ళేనని అల్లరి చేసేరు
వద్దురా చిన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!

ఆడుకోవలెనన్న,పాడుకోవలెనన్న
ఆదటను నేనున్నా,అన్నిటను నీదాన (సెల్‌ఫోన్)
వద్దురా! వద్దురా!!వద్దురా!!!చిన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!అయ్యా!!!
వద్దురా చిన్నయ్యా!!Monday, 23 December 2019

సత్యంవద-ఎందుకే నీకింత తొందర

ఎందుకే నీకింత తొందర

ఓ చిలుక నా చిలుక ఓ రామ చిలుక
ఓ రామ చిలుక వయ్యారి చిలుక      
ఎందుకే నీకింత తొందర       

ఓ  వయ్యారి చిలుక నా రతనాల తునక

ఓ రతనాల తునక  నా మరువంపు  మొలక
ఎందుకే నీకింత తొందర

ఓ మరువంపు  మొలక గారాల మొలక    

 గారాల మొలక  రాగాలచిలుక
ఎందుకే నీకింత తొందర  

చింతలన్నీ బతుకు పుంతలో మాయునా
బాధలన్నీ బతుకు బాటలో తీరునా
ఎందుకే నీకింత తొందర 

ఈ నాటి నా బతుకు ఏ నాడు తీరునో

ఈ పంజరపు బతుకు ఇక నాకు తీరునా?   
ఎందుకే నీకింత తొందర      

జంటగా బతికాము ఒంటిగా నిలిపావే
ఒంటిగా కదిలావు జంట రానందునా  
ఎందుకే నీకింత తొందర    

నాకమ్ము వరకూను

పసిడి  రెక్కల పైన పరువెత్తి పోదుముగా
ఎందుకే నీకింత తొందర     

దేవులపల్లి వారికి క్షమాపణ పూర్వక నమస్కారలతో

Friday, 20 December 2019

సత్యంవద-ఎవరిది రాజ్యం?నాటి సమాజధర్మంలో ఉమ్మడి కుటుంబంలో పెద్దవానిదే రాజ్యం.

అందుకే ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజు చేసాడు. కాని కొడుకు పోరు భరించలేక, కొడుకు రాలుగాయిగా కాల్చుకు చస్తాను, నీటిలో దూకుతాను అని బెదిరించి, యువరాజుగా ఉన్న ధర్మరాజు సోదరులని కాశీ పంపుతాడు, బలవంతంగానే. ఆ తరవాత లక్క ఇంట్లో చనిపోయారని బొల్లి ఏడుపులు ఏడుస్తాడు. మరచిపోతారు. కాని పాండవులు బతికి బట్టగట్టి పెళ్ళి చేసుకుంటారు, బలపడతారు. ధర్మరాజు చనిపోయాడనుకున్న తరవాత దుర్యోధనుడుని యువరాజుగా నియమించలేదు,ధృతరాష్ట్రుడు.
వారు బతికి బట్ట్గట్టేరని తెలిసిన తరవాత ధృతరాష్రుడు వారిని పిలిచి రాజ్య సగభాగమిచ్చి పంపేడు.  రాజ్యమిమ్మని పాండవులడగలేదు. సగభాగం ఎందుకిచ్చాడు? తెలివి తక్కువగా ఇవ్వలేదు. 

కొడుకు, పాండవులు కుటుంబ సభ్యులే కాదు పొమ్మంటున్నాడు. అప్పటి ధర్మం ప్రకారం ఎలా పుట్టినవాడైనా కుటుంబ సభ్యుడే. దీనిని వ్యతిరేకించినవాడు, దుర్యోధనుడు. సమాజాన్ని ఎదిరించినవాడీ విషయంలో. ధృతరాష్రుడు కొడుకును సమర్ధించలేకపోయాడు. సంఘాన్నీ ఎదిరించలేకపోయాడు. మధ్యే మార్గంగా మొత్తం రాజ్యం పోవడం కంటే సగం మిగలడం మేలని పంచి ఇచ్చాడు. పాండవులు హక్కు తమదే ఐనా మిన్న కున్నారు. నిజంగా ధృతరాష్ట్రుడు ధర్మారాజుకే పట్టం కట్టితే ఆ తరవాత మీరన్నట్టు దుర్యోధనుని కొడుకు పెద్దవాడైతే అతనిదే రాజ్యం, అదే నాటి న్యాయం. నేడిది నచ్చకపోవచ్చు. కుటుంబంలో పెద్దవానికి రాజ్యాధికారాన్ని కూడా కాదన్నవాడు దుర్యోధనుడు. ఎవరు రాజ్యం చేస్తున్నారో వారి పెద్ద కొడుక్కి మాత్రమే రాజ్యాధికారం రావాలని అప్పటి నియమాలను కాదన్నవాడు దుర్యోధనుడు. రాజ్యం వీరభోజ్యమనీ నమ్మినవాడు,ఆ విషయాన్ని విద్యా ప్రదర్శన సమయంలో స్పష్టం గా చెప్పినవాడు. 

చివరికి మడుగులో దాగినపుడు బయటికిరా యుద్ధం చెయ్యమన్నపుడు రాజ్యం నీకే వదిలేసాను, నన్నొదిలయమంటే ధర్మరాజు నిన్ను చంపి రాజ్యం ఏలుకుంటా, ఇప్పుడు నువ్వు ఇచ్చేదీ లేదు, నేను పుచ్చుకునేదీ లేదంటాడు. రాజ్యం వీరభోజ్యమనేది తనదాకా వచ్చేటప్పటికి ప్రాణం మీదకొచ్చేసరికి వెనకడుగేసాడు. చివరికి రెచ్చగొట్టి బయటకు రప్పించారు, అది వేరు సంగతి.